Headlines (Telugu):
-
“విజన్-2047: ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు”
-
“టెక్నాలజీతో ముందుకు: శాసనసభ చర్చల్లో విజన్-2047 ప్రాముఖ్యత”
-
“చంద్రబాబు నాయుడు విజన్-2047 పై అభిప్రాయాలు, సుస్థిర పరిష్కారాల దిశగా ప్రణాళిక”
-
“విజన్-2047 ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాశ్వత పరిష్కారాలు”
-
“విజన్-2047లో శాసనసభ, శాసన మండలి వేదికగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష”
వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుందన్నారు. టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారని తెలిపారు.ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో వచ్చేవని.. కానీ ఇప్పుడు లైవ్, సోషల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యే దాకా టెక్నాలజీ వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకు సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తామని.. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయన్నారు. గతంలో కొందరు ఎమ్మెల్యేలను విదేశాలకు పంపి ఆయా దేశాలు సాధించే ఫాస్ట్ గ్రోత్ రేట్ గురించి స్టడీ చేయించామని గుర్తుచేశారు. మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయన్నారు. గతంలో ఒక సబ్జెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమన్నారు. విజన్-2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయలని తెలిపారు. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసనసభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
.