బాల వైజ్ఞానిక ప్రదర్శనలో కలెక్టర్ ఆశిష్ సందర్శన
“విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి” — కలెక్టర్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 24
సోమవారం
స్ప్రింగ్ ఫీల్డ్స్ హై స్కూల్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రయోగ నమూనాలు, ఎగ్జిబిట్లను పరిశీలిస్తూ వారిని అభినందించారు.
కలెక్టర్ మాట్లాడుతూ—
కామారెడ్డి జిల్లాలో మొత్తం 550 ప్రాజెక్టులు, INSPIRE విభాగంలో 91 ప్రాజెక్టులు పాల్గొనడం పిల్లల్లో పెరుగుతున్న శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనమన్నారు. ప్రతి విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రశ్నించే తత్వం అవసరమని, శాస్త్రీయ ఆలోచన పెంపొందేలా ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు. ప్రదర్శనలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.