మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగర్ మేయర్ , కర్పొరేటర్ల పర్యటన…

ఇండోర్ మేయర్ మరియు మునిసిపల్ కమిషనర్ తో భేటీ అయిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 25: శేరి లింగంపల్లి ప్రతినిధి 

 

గ్రేటర్ హైదరాబాద్ నగరాభివృద్ధి లక్ష్యాలను పురస్కరించుకుని, మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నగరానికి వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్,ఇండోర్ మునిసిపల్ కమిషనర్ శివమ్ వర్మ ఐఏఎస్,అదనపు కమిషనర్ అభిలాష్ మిశ్రా ఐఏఎస్, మరియు ఇతర ఉన్నత అధికారులతో సమావేశం పాల్గొన్నారు .ఈ సమావేశంలో ఇండోర్ నగరంలో అమలు అవుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం నిర్వహణ, మరియు పట్టణాభివృద్ధి అంశాలను ప్రాథమికంగా పరిశీలించారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఇండోర్ లో అమలవుతున్న అభివృద్ధి విధానాలను పరిశీలించి, వాటిని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నాం అన్ని అన్నారు. ప్రత్యేకంగా, పట్టనాభివృద్ధి, పరిశుభ్రత, రహదారి నిర్వహణలో ఇండోర్ నగరం చూపిన విజయం చాలా అవసరం అని తెలిపారు.అంతేకాకుండా ఇండోర్ లో వినియోగిస్తున్న పర్యావరణ స్నేహపూర్వక పద్ధతులు మరియు ప్రభుత్వ కార్యక్రమాలను గమనించి, వాటిని ప్రోత్సహించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ముఖ్యమని నేను భావిస్తున్నాను అని స్పష్టం చేశారు.ఈ విధానాలు పరిశుభ్రత, పునరుత్పత్తి చేయగల శక్తి వనరులు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, మరియు పచ్చదనంతో కూడిన ప్రదేశాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలను ప్రాధాన్యత ఇస్తాయి, ఇవి పర్యావరణానికి మరియు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి నిర్వహణ, సాంస్కృతిక మరియు వారసత్వ పరిరక్షణ, ఇతర పౌర సేవలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ప్రాధాన్యంగా చేపట్టబడతాయిఅన్ని అన్నారు.ఈ కార్యక్రమం లో ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్,ఇండోర్ మునిసిపల్ కమిషనర్ శివమ్ వర్మ ఐఏఎస్,అదనపు కమిషనర్ అభిలాష్ మిశ్రా ఐఏఎస్,ఇతర ఉన్నత అధికారులు,గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now