గౌరీ సమేత ఓంకారాలేశ్వర ఆలయ దర్శనం
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రత్యేక పూజలు
కామారెడ్డి జిల్లా, ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 23:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ కాలనీలో ఉన్న గౌరీ సమేత ఓంకారాలేశ్వర ఆలయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కపిల ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.