ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ నల్లగట్ల వెంకన్న మాదిగ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
స్థానిక ఏరియా హాస్పిటల్ భద్రాచలం నందు అనారోగ్యంతో బాధపడుతున్న మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లతను పరామర్శించి, కుటుంబాన్ని ఓదార్చిన, భరోసా ఇచ్చిన ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా కన్వీనర్ నల్లగట్ల వెంకన్న మాదిగ మాట్లాడుతూ… గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదిగ కాకపోయినా మహాజన మహిళా ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ మాదిగ, మాదిగ ఉప కులాల ఆకాంక్ష, లక్ష్యం ,
హక్కుల సాధన కోసం మాతో ఫైనాన్స్ గత మూడు రోజులుగా అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో వైద్యం అందించుకుంటున్న మేకల లత కు వారి కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మేకల లత త్వరగా కోలుకొని ప్రజా ఉద్యమంలో మాతో పయనించాలని ఆశిస్తున్నామని అన్నారు. పరామర్శించినవారు భద్రాచలం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కోట ప్రభాకర్ మాదిగ కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ, మాదిగ కళామండలి నాయకులు మెంతిని కొండలరావు మాదిగ, కొప్పుల నాగమణి మాదిగ,తదితరులు పాల్గొన్నారు.