

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఆయన ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల గురించి వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా, త్వరలో వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.సీజనల్ వ్యాధులు అయిన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లపై అప్రమత్తంగా ఉండాలని, కావాల్సిన మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే బడ్జెట్ లో వైద్య ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయించామని ఎమ్మెల్యే గారు తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని అన్నారు.