*వివేకానంద బి టాపర్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 22
వివేకానంద బీ టాపర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో పోచమ్మ దేవత మూర్తులకు ఘనంగా బోనాలు తీయడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ కేశిరెడ్డి గురవేందర్ రెడ్డి మాట్లాడుతూ బీ టాపర్స్ హై స్కూల్ గత మూడు సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా ఆషాడంలో అమ్మవారికి బోనాలు తీయడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు దీనిలో పిల్లల పోతురాజుల వేషధారణ అందరికి ఆకర్షణంగా నిలిచింది, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని బీ టాపర్ స్కూల్ తరఫున కోరడం జరిగిందన్నారు . ఈ సందర్భంగా వివేకానంద బీ టాపర్స్ హై స్కూల్ తరపున అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనీ తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వీరభద్రప్ప, డైరెక్టర్ రవి రెడ్డి, కోఆర్డినేటర్ లు శ్రీకాంత్, కిరణ్మయి,మౌనిక,భీందుశ్రీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.