నవోదయ లో ప్రతిభ కనబర్చిన వివేకానంద విద్యార్థులు
ప్రశ్న ఆయుధం 25 మార్చి (జుక్కల్ ప్రతినిధి )
ఇటీవలే వెలువడిన నవోదయ ఫలితాల్లో జుక్కల్ మండలంలోని వివేకానంద స్కూల్ కు చెందిన శ్రీకాంత్,అరవింద్,కార్తీక్ లు ముగ్గురు విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు.మారుమూల ప్రాంతం నుండి నవోదయలో సీటు సంపాదించడం గర్వించదగ్గ విషయమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.నవోదయలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వివేకానంద స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ చంద్రకాంత్ సిబ్బంది అభినందనలు తెలిపారు.