మల్లంరాజు స్మారకార్థం వాలీబాల్ టోర్నమెంట్

గజ్వేల్ మాజీ ఎంపీపీ, తాజా మాజీ సర్పంచ్ స్వర్గీయ మల్లంరాజు స్మారకార్థం వాలీబాల్ టోర్నమెంట్

మల్లంరాజు స్వగ్రామం కొల్గూర్ లో మల్లం సుమతి ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహణ

గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, 12 జనవరి 2025 : గజ్వేల్ మాజీ ఎంపీపీ, కొల్గూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ స్వర్గీయ మల్లం రాజు స్మారకార్ధం గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ మల్లం సుమతి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ ను మల్లం సుమతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో గజ్వేల్ మండలంలోని వివిధ గ్రామాల నుండి ఇరవైకి పైగా జట్లు పోటీలలో పాల్గొన్నాయి. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సత్యగౌడ్, మాజీ ఉపసర్పంచ్ మల్లేశంగౌడ్, జెగ్గరి బైరయ్య, సాయగౌని నర్సింలు గౌడ్, మల్లం పుల్లయ్య, బాగిరెడ్డి నీరుడి సాయిలు, జీడిపల్లి చంద్రారెడ్డి, సురేందర్ రెడ్డి, సాయగౌని నాగరాజు గౌడ్, నందాల పవన్, నీరుడి లక్ష్మినారాయణ, గొడుగు యాదగిరి, గొడుగు బాలకిషన్, బాగోని నరేష్ గౌడ్, సాయగౌని సాయికుమార్ గౌడ్, వంజరి బాలకిషన్, గొడుగు కరుణాకర్, చిన్నారం చందు, రెకిష్టాడ్డి, నర్సింలు, మల్లం ప్రసాద్, జెగ్గరి మనోజ్ కుమార్, జెగ్గరి సాగర్, జీడిపల్లి కమలాకర్ రెడ్డి, పాపం సత్తయ్య,డాకాని స్వామి, నీరుడి రాజు, కర్రోల కనకయ్య, కమ్మరి నాగరాజు, కొలిచేల్మి దీరజ్, మన్నే పరమేష్, గ్రామా క్రీడాకారులు అజయ్, మహేందర్, మధు, పింటు నాగరాజు, అర్జున్, సాయి, యేసు రాజు, సందీప్, ప్రదీప్, వంశీ పాల్గొన్నారు. విజేతలైన క్రీడాకారులకు త్వరలోనే బహుమతులను ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకురాలు మల్లం సుమతి తెలిపారు.

Join WhatsApp

Join Now