నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్
●టోర్నమెంట్ లో పాల్గొన్న 16 టీమ్స్
విజేతలకు నగదు బహుమతి ప్రధానం
ముఖ్యఅతిథి హాజరైన సురక్ష హాస్పిటల్ డాక్టర్ తిరుపతి
ఇల్లందకుంట అక్టోబర్9 (ప్రశ్న ఆయుధం)
ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు ప్రభుత్వ పాఠశాలలో దసరా పండుగను పురస్కరించుకుని సిరిసేడు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ ని బుధవారం నిర్వహించారు..ఈ టోర్నమెంట్ కి హాజరై జమ్మికుంట సురక్ష మల్టిస్పెషలిటీ హాస్పిటల్ డాక్టర్ తిరుపతి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలిలో శారీరక శ్రమ లేకపోవడం తో యువత తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మవిశ్వాసాలను కోల్పోవడం లాంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని ఇట్లాంటి క్రీడలు నిర్వహించడం వల్ల శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉంటుందని అన్నారు..క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమని ఓడిన గెలిచిన క్రీడా స్ఫూర్తి గా తీసుకోవాలని అన్నారు టోర్నమెంట్ నిర్వాకులు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో 16 గ్రామాల నుండి టీములు వచ్చాయని ఫైనల్ విజేతగా సిరిసేడు జట్టు నిలిచిందని ద్వితీయ స్థానంలో ఇల్లందకుంట జట్టు నిలిచిందని అన్నారు మొదటి విజేతకు 10వేల రూపాయలు రెండవ విజేత కి 5వేల నగదు బహుమతి అందించినట్లు తెలిపారు.. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు రేనుకుంట్ల తారక్,జెకె,మంగళంపల్లి సంపత్ మాజీ ఎంపీటీసీ రేనుకుంట్ల చిన్నారాయుడు,రేనుకుంట్ల కుమార్, భోగం మురళి, వాలీబాల్ ఎంపైర్ బలబత్తుల వర్ధన్,రేనుకుంట్ల అంజి,విరాట్, సంతోష్,చింటూ,విష్ణు,అరవింద్,రాజు,అజయ్ తదితరులు పాల్గొన్నారు.