Site icon PRASHNA AYUDHAM

“కుర్చీ గుర్తుకు ఓటు వేసి విద్యావంతులను ఎన్నుకోండి” — రామకోటి రామరాజు

IMG 20251018 WA0034

“కుర్చీ గుర్తుకు ఓటు వేసి విద్యావంతులను ఎన్నుకోండి” — రామకోటి రామరాజు

“మంచి కోసం మార్పు ఎంతో అవసరం” — గజ్వేల్‌లో పద్మశాలి సంఘ ఎన్నికల సందర్బంగా పిలుపు

గజ్వేల్‌లో ఆదివారం జరగనున్న పద్మశాలి సంఘ ఎన్నికలకు ఉత్సాహం.

అధ్యక్ష పదవిలో పోటీ చేస్తున్న బోలిబత్తుల దేవదాసుకు మద్దతుగా రామకోటి రామరాజు పిలుపు.

కుర్చీ గుర్తు చిత్రాన్ని ఆవిష్కరించి అభ్యర్థికి అందజేత.

“సమాజానికి విద్యావంతుల నాయకత్వం అవసరం” — రామకోటి రామరాజు.

కార్యక్రమంలో పద్మశాలి సంఘ ప్రతినిధులు, భక్త సమాజ సభ్యులు పాల్గొన్నారు.

ప్రశ్న ఆయుధం గజ్వేల్, అక్టోబర్ 18:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జరగనున్న పద్మశాలి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు, సమాజ సేవకుడు బోలిబత్తుల దేవదాసుకు మద్దతుగా భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ప్రజలను సంబోధించారు.

శనివారం నాడు గజ్వేల్‌లో కుర్చీ గుర్తు చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి, సంఘ ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించి దేవదాసుకు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ, “మంచి కోసం మార్పు చాలా అవసరం. విద్యావంతులు, సేవా మనసు కలవారే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు. కుర్చీ గుర్తుకు ఓటు వేసి బోలిబత్తుల దేవదాసు గారిని విజయం సాధింపజేయండి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘ ప్రతినిధులు, యువత, భక్త సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version