*ఆధార్, మొబైల్ నంబర్లతో ఓటరు కార్డు లింక్ అవ్వాలి: ఈసీఐ*
ఓటర్ ఐడీ కార్డుల్ని ఆయా ఓటర్ల ఆధార్, మొబైల్ నెంబర్లతో అనుసంధానించాలని ఈసీ అన్ని రాష్ట్రాల సీఈఓలను ఆదేశించింది. దీంతో పాటు జనన, మరణాల వివరాల ఆధారంగా ఓటర్ లిస్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓటరు నమోదుకు ఆధార్ లింక్ కంపల్సరీ కాదని 2022లో సుప్రీం కోర్టు తీర్పునివ్వగా ఈసీఐ తాజా ఆదేశాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.