*ఓటర్స్ డే మండల స్థాయి వ్యాసరచన ఉపన్యాస పోటీలు*
*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎం ఆర్ సి భవనంలో శుక్రవారం ఓటర్స్ డే పురస్కరించుకుని మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు ఇందులో డెమోక్రసీ అండ్ ఓటర్స్ పార్టిసిపేషన్ (ప్రజాస్వామ్యం ఓటరు భాగస్వామ్యం ) అను అంశంపై వ్యాసరచన పోటీలలో
మాచనపల్లి యుపిఎస్ పాఠశాల విద్యార్థి అప్పని సృజన్ వర్మ ప్రథమ స్థానం, జడ్పిహెచ్ఎస్ వావిలాల పాఠశాల విద్యార్థి జస్వంత్ ద్వితీయ స్థానం అలాగే ఉపన్యాస పోటీలలో ప్రథమ స్థానం ప్రభాశృతి కేజీబీవీ జమ్మికుంట ద్వితీయ స్థానం ప్రజ్వల్ జడ్పీహెచ్ఎస్ బాయ్స్ జమ్మికుంట విద్యార్థికి రావడం జరిందని ప్రథమ స్థానం వచ్చిన ఇద్దరు విద్యార్థులు శనివారం అనగా 25వ తేదీ వోటర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు తీసుకుంటారని జమ్మికుంట మండల విద్యాధికారి వేముగంటి హేమలత తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను ఎంఈఓ హేమలత మాచనపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దిడ్డి వనమాల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.