వీఎస్‌టీ, సాయి నగర్ కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి – ముప్పు శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 11
నాగారం మున్సిపల్ పరిధిలోని వీఎస్‌టీ, సాయి నగర్ కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి దృష్టి సారించారు. ఈ రోజు కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన రెండు కాలనీలను సందర్శించి, కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నివాసితులు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల సమస్యలతో పాటు పారిశుద్ధ్య లోపాలు, వీధిలైట్ల నిర్వహణలో లోపాలను వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మున్సిపల్ అధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటానని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.