గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి

–బి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరి వీరేశం

శివ్వంపేట జనవరి 7 (ప్రశ్న ఆయుధం న్యూస్ డే):
చాలీచాలని వేతనాలతో కాలం వెలదీస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని,ఇప్పటివరకు వారికి రావాల్సిన వేతనాలను ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉందని బి. ఆర్. టి. యు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరి వీరేశం డిమాండ్ చేశారు. ఉన్నాడు బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఇంకా నాలుగు నెలల వేతనాలు రావాల్సిన అవసరం ఉంది అని వారు గుర్తు చేశారు,అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామపంచాయతీ కార్మికులే ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ఈ విషయాన్ని అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చిలివేరి వీరేశం అన్నారు. కుటుంబాలను పోషించలేక పంచాయతీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వేళ గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చాలా రాకపోవడం బాధాకరమని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు,అదేవిధంగా వారికి ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు,

Join WhatsApp

Join Now