స్కావెంజర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి

స్కావెంజర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి

– టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల లింగం

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో పని చేస్తున్న స్కావెంజర్లకు వెంటనే గౌరవ వేతనం చెల్లించాలనీ టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో కేవలం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మూడు నెలలకు మాత్రమే ఒక సారి వేతనాలు చెల్లించడం జరిగిందన్నారు. డిసెంబర్ మాసం నుండి చెల్లించాల్సి ఉందన్నారు. ఒక వైపు మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇంతవరకు నిధులు పాఠశాలలకు విడుదల కాలేదనీ, పాఠశాలలలో స్కావెంజర్ల సేవలు లేనిదే పాఠశాల నిర్వహణ కష్టంగా ఉంటుందనీ, ప్రతి పాఠశాలలో అటెండర్ పోస్టులు లేవు. అటెండర్ లేని చోట అన్ని పనులు చేసుకోవాలంటే ప్రధానోపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందన్నారు. ఒక పాఠశాలలో ఆవరణ, తరగతి గదులు శుభ్రం చేయడం, తాగు నీరు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్ల నిర్వహణ, చెట్ల పెంపకం లాంటి పనులు తప్పనిసరి చేయడం వీటితోపాటు ఇతరత్రా పనులు కూడా చేయవలసి ఉంటుందన్నారు. ప్రతి పాఠశాల పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనేది సామాజిక సూత్రం అని పేర్కొన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల వ్యక్తిగత ఆరోగ్యం, చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, పరిసరాల సంరక్షణ మొదలగు అంశాలు చిన్ననాటి నుండే అవగాహన కల్పించాలి. ఇవన్నీ విద్యార్థులు నేర్వాలంటే పాఠశాలలలో ప్రత్యేకంగా అలవాటు పడాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రతి పాఠశాలలో స్కావెంజర్ల సేవలు తప్పనిసరి అన్నారు. గతంలో ప్రతి పాఠశాలలో పాఠశాల నిర్వహణ కోసం స్కావెంజర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కావెంజర్లను నియమించుకొని, నెల నెలా గౌరవ వేతనాలు చెల్లించడం జరిగింది. స్కావెంజర్లతో పాఠశాలలకు చాలా మేలు కూడా జరిగిందన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పాఠశాలలలో స్కావెంజర్ల అవసరం గుర్తించి, విద్యార్థుల సంఖ్యను బట్టి గౌరవ వేతనం నిర్ణయించి, స్కావెంజర్ల నియామకం చేశారు. మొదటగా వీరికి మూడు నెలల అనగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకుగాను మూడు నెలల మాత్రమే గౌరవ వేతనం విడుదల చేయడమైనదన్నారు. ప్రస్తుతం డిసెంబర్ మాసం నుండి నిధులు విడుదల చేయకపోవడం మూలంగా గౌరవ వేతనం మీద మాత్రమే ఆధారపడి ఉన్న స్కావెంజర్లకు ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు వేతనాలు అందుతాయో అని ఎదిరి చూస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో ముగియనుంది. మార్చి 31 లోపు వేతనాలు చెల్లించాలి. కావునా విద్యా శాఖ తొందరగా నిధులు విడుదల చేస్తే, ప్రధానోపాధ్యాయులు వెంటనే స్కావెంజర్లకు చెల్లించడానికి సమయం ఉంటుందన్నారు. కావునా ప్రభుత్వం వెంటనే స్కావెంజర్ల కు గౌరవ వేతనం విడుదల చేయాలని కోరుతున్నాం అన్నారు.

Join WhatsApp

Join Now