బీసీలకు 42% రిజర్వేషన్ సాధనపై గజ్వేల్‌లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

బీసీలకు 42% రిజర్వేషన్ సాధనపై గజ్వేల్‌లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కేంద్రం నిర్లక్ష్యం – తెలంగాణ ఎంపీల మౌనం బాధాకరం

ప్రశ్న ఆయుధం సిద్దిపేట జిల్లా గజ్వేల్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి ఆధ్వర్యంలో BC, SC, ST సంఘాల నాయకులు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.

పార్లమెంటులో చర్చ జరగకపోవడం ఆందోళనకరం

చిప్పల యాదగిరి మాట్లాడుతూ – తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై కనీసం చర్చ జరగకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఎంపీలు కూడా నోరెత్తకపోవడం బాధాకరమని విమర్శించారు.

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం బిల్లును ఆమోదించాలి

మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ – విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ అవకాశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి

ముదిరాజ్ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు గుంటుకు శ్రీనివాస్ మాట్లాడుతూ – స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రధాన రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వాలని కోరారు.

పోరాటం కొనసాగుతూనే ఉంటుంది

BC సీనియర్ నాయకులు నక్క రేగొండ మాట్లాడుతూ – 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే వరకు అన్ని సంఘాలతో కలసి పోరాటం చేస్తామని తెలిపారు.

ST సంఘం నాయకుడు ప్రవీణ్ కూడా ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

యువత, విద్యార్థులు ఉద్యమంలో భాగమవ్వాలి

సీనియర్ నాయకులు నాగులు మాట్లాడుతూ – దళిత, బహుజన విద్యార్థి, యువజనులు అందరూ ఈ పోరాటంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తేవాలి

CITU జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ – రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి 42 శాతం రిజర్వేషన్ త్వరగా అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మనోహర్, రాజు, రవి, ప్రభాకర్, స్వామీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment