సుద్దాల అశోక్ తేజకు ఆహ్వాన పత్రిక అందజేసిన వంగపల్లి అంజయ్య స్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా తెలుగు సినిమా పాటల రచయిత, తెలుగు సాహిత్యకారుడు. సుమారు 2000కి పైగా సినిమాల్లో 3000 పైచిలుకు పాటలు రాసిన ప్రముఖ రచయిత గాయకుడు సుద్దాల అశోక్ తేజకు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23 – 02 – 2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా సుద్దాల అశోక్ తేజకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని అన్నారు.