‘వార్ 2’ని తక్కువ అంచనా వేస్తున్నారా?
ఆగస్టు 14న కూలీతో పాటుగా ‘వార్ 2’ విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్ల విషయంలో ‘వార్ 2’ కాస్త వెనుకబడిన మాట వాస్తవం. అయితే వార్ 2ని తక్కువ అంచనా వేస్తే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన తొలి బాలీవుడ్ సినిమా ఇది. పైగా హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. వార్ అనేది సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ. వార్‌లోని యాక్షన్ సీన్లు చూసి యూత్ అబ్బురపడ్డారు. ఈసారి హృతిక్‌కి ఎన్టీఆర్ తోడయ్యాడు. యష్ రాజ్ ఫిల్మ్స్‌ని కూడా లైట్ గా తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ల ప్లానింగ్ పర్‌ఫెక్ట్ గా ఉంటుంది. కూలీతో పోటీ ఉందని తెలిసినా కూడా వాళ్లు జంకడం లేదు. దాన్ని బట్టి తమ సినిమాపై వాళ్లకెంత నమ్మకమో అర్థం చేసుకోవొచ్చు.పైగా ఆగస్టు 14 చాలా మంచి డేట్. వరుసగా నాలుగు రోజుల సుదీర్ఘమైన వీకెండ్ వస్తోంది. నాలుగు రోజుల్లో ప్రేక్షకులు ఒక్క సినిమాతో సరిపెట్టుకోరు. రెండు సినిమాలూ చూడాల్సిందే. కాబట్టి కూలీతో పోటీ గట్టిగా ఉన్నా, వార్ 2 వసూళ్లకు అడ్డు ఉండబోదు. పైగా నార్త్ లో కూలీ కంటే.. ‘వార్ 2’కే హైప్ ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా