ఇండియన్ లీగల్ ప్రొఫేషనన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో జరిగిన బి.సి న్యాయవాదుల రాష్ట్ర సదస్సుకు వరంగల్, హన్మకొండ న్యాయవాదులు తరలి వెళ్ళారు. వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బార్ అససియేషన్ల ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్, హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి లడే రమేష్, ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు దయాల సుధాకర్, విజేందర్, శ్యామ్, విక్రమ్, కూనూరు రంజిత్ గౌడ్, సుందర్ రామ్, సత్యనారాయణ రెడ్డి, సురేందర్, గట్టు రవి, సాజిత్, ముకుందరావు, రాజ్ కుమార్, పిల్లి కార్తీక్, అనిల్, పండగ శ్రీనివాస్, రామనాథం తదితరులు తరలి వెళ్ళారు.
బి.సి లకున్న ప్రధాన సమస్యలైన బి.సి కుల జనగణన, న్యాయ వ్యవస్థలో జనాభా దామాషా ప్రకారం వాటా, మహిళా బిల్లులో బి.సి కోటా, చట్టసభల్లో వాటా లాంటి ముఖ్యమైన అంశాలపై జరుగు సదస్సుకు తెలంగాణ రాష్ట్ర బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు బి.సి కమీషన్ చైర్మన్ వకులాబరణం కృష్ణ మోహన్, ప్రొఫెసర్ సింహాద్రి, ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎస్ బాలన్, వాసంతి నల్వాడే, వినాయక్ ప్రసాద్ షా లాంటి ప్రముఖులు ప్రసంగిస్తారని వారు తెలిపారు.