న్యూ ఢిల్లీ
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాను కలసిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ లో CGHS వెల్‌నెస్ సెంటర్ ను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కలసి విజ్ఞప్తి చేసిన ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
త్వరలోనే వరంగల్ లో వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్‌లో ఇప్పటికే ఆమోదం పొందిన CGHS వెల్‌నెస్ సెంటర్ ను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసి ఎంపీ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్‌లో వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, వరంగల్ లో CGHS సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు హైదరాబాద్ లేదా ఇతర నగరాలకు వెళ్లి చికిత్స పొందాల్సి వస్తోందని తెలిపారు. ఇది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్రమంత్రికి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వరంగల్‌లో CGHS సెంటర్‌కు ఆమోదం తెలిపిందని, కానీ ఇంకా ప్రారంభం కానందు వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు నష్టపోతున్నారని ఎంపీ డా.కడియం కావ్య తెలిపారు. వెంటనే వరంగల్ CGHS లో వైద్య సిబ్బంది నియామకం చేపట్టి, శాశ్వత భవనం కేటాయించి సెంటర్‌ను ప్రారంభించాలని ఎంపీ కేంద్ర మంత్రి జె.పి. నడ్డాను కోరారు.
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జె.పి నడ్డా వరంగల్ లో CGHS ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.