ఇలాంటి బావమరిది దొరకడం అదృష్టం: చంద్రబాబు
నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 50 ఏళ్లుగా ఎవర్రీన్ హీరోగా రాణిస్తున్నారు. ఆయనలో గొప్ప మానవతావాది ఉన్నారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎంత ఎమోషనల్గా ఉంటాడో అంత మంచిమనిషి. నాకొక అద్భుతమైన బావమరిది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని చంద్రబాబు అన్నారు.