భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ..వినేశ్ ఫొగట్ పై వేటు వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. అతడిని బహిష్కరించాలనే డిమాండ్‌తో దేశ రెజ్లర్లంతా ఏడాదికిపైగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి వినేశ్‌తోపాటు ఇతర స్టార్ రెజ్లర్లు బజ్‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్ నేతృత్వం వహించారు. తీవ్ర స్థాయికి చేరిన ఆ ఉద్యమం పార్లమెంట్ ముట్టడికి దారి తీయడం.. ఆ క్రమంలో వినేశ్ సహా ఇతర రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్యపై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు వేసింది. రెజ్లర్ల ఆందోళన ఫలితంగా డబ్ల్యూఎఫ్‌ఐకి బ్రిజ్‌భూషణ్ రాజీనామా చేయక తప్పలేదు. అలాగే.. బ్రిజ్‌భూషణ్ తదితరులపై కేసులు నమోదై కోర్టు విచారణ వరకు వెళ్లింది. కాగా..డబ్ల్యూఎఫ్‌ఐకి జరిగిన ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ ప్రధాన అనుయాయి సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడం గమనార్హం. సంజయ్ సింగ్ ఎన్నికపై స్టార్ రెజ్లర్లంతా ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారంటారు.మొత్తంగా రెజ్లర్ల ఆందోళన దేశ క్రీడా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. నాటి ఆందోళనతో రెజ్లింగ్ సమాఖ్య అప్పటి పెద్దలు, ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఈనేపథ్యంలో.. కీలకమైన ఒలింపిక్స్ 50 కి. ఫైనల్ బౌట్‌కు ముందు వినేశ్ ఫొగట్‌పై వేటు పడడం చర్చకు దారి తీసింది. నాటి ఆందోళనను జీర్ణించుకోలేని సమాఖ్య పెద్దలు కొందరు.. ఫొగట్ డిస్‌క్వాలిఫికేషన్ వెనుక ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని సహాయ సిబ్బందితో వినేశ్‌కు ఇవ్వడం ద్వారా ఆమె బరువు పెరిగేలా కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ కూడాj కుట్రకోణం ఉందనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ‘మన రెజ్లర్లపై ఇది పెద్ద కుట్ర. 100 గ్రాముల బరువు తగ్గేందుకు వినేశ్‌కు మరింత సమయం ఇవ్వాల్సింది. గతం లో ఏ అథ్లెట్‌కు ఇలాంటిది జరగలేదు’ అని విజేందర్ ఎక్స్‌లో వ్యాఖ్యానించాడు. ఏమైనా.. వినేశ్ ఫొగట్‌పై వేట దేశ క్రీడా రంగంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది.
అలాంటిదేమీ లేదు..
వినేశ్ డిస్‌క్వాలిఫై అంశంలో కుట్రలేదని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) స్పష్టంజేసింది. ఈమేరకు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. అది సాంకేతిక అంశమని, దానిని రాజకీయం చేయొద్దని సమాఖ్య అధ్యక్షుడు సుమరివాలా కోరారు..