మారుతి గార్డెన్ లో పైపు లీకేజీపై స్పందించిన జలమండలి అధికారులు
నాగారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వెంటనే చర్యలు
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 1
మారుతి గార్డెన్ మెయిన్ రోడ్డులో వెలుగులోకి వచ్చిన మంచినీటి పైపులైనులో లీకేజీ సమస్యపై నాగారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి జలమండలి అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన విజ్ఞప్తిని వెంటనే పరిగణలోకి తీసుకున్న జలమండలి ఏరియా మేనేజర్ సాయి కిరణ్ గౌడ్, జూనియర్ ఇంజనీర్ హరీష్ స్థానికులతో కలిసి లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏరియా మేనేజర్ సాయి కిరణ్ గౌడ్, జె.ఇ. హరీష్ పైపు లీకేజీని త్వరితగతిన సరిచేస్తామని హామీ ఇచ్చారు. నీటి వనరులను వృథా చేయకుండా, ప్రజలకు నిరంతర నీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఘనపురం కొండల్రెడ్డి, మాజీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు మొసలి శ్రీనివాస్ రెడ్డి, సకినాల ప్రశాంత్ నాయుడు, గున్నాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.