కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పి హెచ్ సి కి వాటర్ ఫిల్టర్ బహుకరణ /

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాటర్ ఫిల్టర్ బహుకరణ చేసి మోటకొండూరు ఎస్ ఐ నాగుల ఉపేందర్ చేతుల మీదుగా ప్రారంభం చేయించారు..ఈ సందర్బంగా చంద్రకళ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మంచినీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో వాటర్ ఫిల్టర్ బహుకరణ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్బంగా వైద్యాదికారి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ కంది పౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, రోగుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ బహుకరణ చేసిన చంద్రకళ వెంకట్ రాంరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్,మోజేస్,ఎస్ ఐ ఉపేందర్, హెచ్ ఈ వో నర్సింహ, హెచ్ ఎస్ అంజూమ్, నర్సింగ్ అపిసర్ కవిత, ఎమ్ పి హెచ్ ఏ ఎస్ సుభాషిణి, యాకయ్య, ఎల్టి , ఎల్డిసీ సురేష్, సందీప్, డ్రైవర్ సురేష్,ఆశాలు జయమ్మ, అయిలమ్మ, మహాలక్ష్మి,మమత పోలీసు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 20