రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా
ప్రశ్న ఆయుధం, ఆగష్టు 17, కామారెడ్డి :
రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసిన ప్రాంతాలను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి శనివారం పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షం కారణంగా జేపీఎన్ రోడ్, హౌజింగ్ బోర్డు కాలనీ, బతుకమ్మ కుంట ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలవడంతో మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీ లించారు. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో ఆ ఇంటి యజమానులతో కలిసి మాట్లాడారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు.
డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా చేయాలని పలువురు కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా మున్సిపల్ అధికారులకు తెలిపారు. వర్షం నీరు ఇళ్లలోకి, దుకాణ సముదాయాల్లోకి రాకుండా చూడాలని, అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టాలని, రహదారులపై నీరు నిల్వ ఉండకుండా, డ్రైనేజీ నీరు నిలువకుండా చూసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.