భారీ వర్షాల బాధిత కుటుంబాలకు అండగా మేము సైతం

భారీ వర్షాల బాధిత కుటుంబాలకు అండగా మేము సైతం

 

ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ

 

– కామారెడ్డి జిల్లా 02 సెప్టెంబర్ ( ప్రశ్న ఆయుధం )

 

ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి మునిసిపల్ పరిధిలో వందమంది వరద బాధిత కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యవసర సరకులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోస్క రాజయ్య కాలనీ , కౌండిన్య, హౌసింగ్ బోర్డు కాలనీల్లో గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు నష్టపోయిన వరద బాధితులు వందమంది కుటుంబాలకు ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం నెల రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వెంకట్ గౌడ్ మట్ట శ్రీనివాస్ సైదు గారి అశోక్ గౌడ్ జనగామ శ్రీనివాస్ రెడ్డి మల్కాపూర్ రాంరెడ్డి రాజా గౌడ్ దోమకొండ నాగరాజు మల్కాపూర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ పైడి రామిరెడ్డి గర్గుల్ శంకర్ గౌడ్ బిబిపేట ఎక్స్ ఎంపీటీసీ ఆది రాజయ్య సివిల్ల పరశురామ్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now