తలసేమియా చిన్నారుల కోసం 50 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తాం
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 4
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ఐవిఎఫ్ సేవాదళ్ అధ్యక్షులు ముస్తాల సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన, ఐవిఎఫ్ సేవాదళ్, రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను, నిర్వహించడం జరుగుతుందని, ఈ శిబిరాలలో 50 వేల, యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం అందజేస్తామని, ఇప్పటివరకు తలసేమియా చిన్నారుల కోసం 3500 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లో నమోదు కావడం జరిగిందని అన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ
కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, ప్రతినిధులు తోట రాజశేఖర్, రామకృష్ణ, ప్రణీష్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.