Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి మాటలను ఖండిస్తున్నాం.

IMG 20250104 WA00081

ముఖ్యమంత్రి మాటలను ఖండిస్తున్నాం.

– సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ మరిచారా?

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామరెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా 26వ రోజు ప్రభుత్వం తమ సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్లి నిజం సాగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి అనంతరం రోడ్డుపై బేటాయించారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ సీఎం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయమని స్కీమ్ అని అన్న మాటలను ఖండించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ గత ప్రభుత్వంలో సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం ,మంత్రులు మర్చిపోయి క్రమబద్ధీకరణ సాధ్యం కాదని చెప్పడం విడ్డూరమన్నారు. పంజాబ్, హర్యానా, సిక్కిం,జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులర్ చేశారని, పే స్కెల్ అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నించారు.

అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన 16 జీవో క్రమబద్ధీకరణకు అడ్డొస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వరని, ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన అంటే అని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా క్యాబినెట్ సమావేశంలో తమ అంశాన్ని చర్చించి పరిష్కారం చూపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.తెలంగాణ లో అడ్డబిడ్డలు రోడ్డు ఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం తీరు బాగులేదు అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వైకెట్ ఆజాద్, విద్యార్ధి నాయకులు బివిఎం విట్టల్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు సంతోష్ రెడ్డి, రాములు, వనజ,రమేష్, శ్రీవాణి,శైలజా,కాళిదాసు, వీణ,చిరంజీవి, కృష్ణ, శ్రీనివాస్,మాధవి,సంధ్యా,దినేష్,శంకర్,ఇతరులు పాల్గొన్నారు.

Exit mobile version