ఫోన్‌ట్యాపింగ్‌ కేసు.. రెడ్‌కార్నర్‌ నోటీసుకు సీబీఐని కోరాం..

ఫోన్‌ట్యాపింగ్‌ కేసు.. రెడ్‌కార్నర్‌ నోటీసుకు సీబీఐని కోరాం..

నిందితులను ఎవరినీ వదిలపెట్టం: హైదరాబాద్‌ సీపీ కొత్తకోట..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు ఎవరినీ వదిలిపెట్టబోమని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన నిందితులు– ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల అరెస్టుకు రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను కోరామన్నారు. శనివారం సీసీఎ్‌సలో ఓ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘సీబీఐ ప్రస్తుతం బ్లూకార్నర్‌ నోటీసు జారీ చేయాలనుకుంది. దాని వల్ల నిందితులు ఎక్కడున్నారనే వివరాలు తెలుస్తాయి.అయితే.. బ్లూకార్నర్‌ నోటీసు ద్వారా నిందితులను అరెస్టు చేయడం కుదరదు. దాంతో రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేశాం’’ అని సీపీ వివరించారు. రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ అయితే.. నిందితులను అరెస్టు చేసి, భారత్‌కు తీసుకువస్తామన్నారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తూ.. దర్యాప్తును కొనసాగిస్తున్నామని వెల్లడించారు.కాగా.. ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌కుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు అరెస్టయిన విషయం తెలిసిందే. హృద్రోగ రుగ్మతలతో బాధపడుతున్న భుజంగరావుకు చికిత్స నిమిత్తం ఇటీవలే కోర్టు మధ్యంతర బెయిల్‌ లభించింది. మిగతా ముగ్గురు చంచల్‌గూడ జైలులోనే ఉన్నారు. వీరి విచారణ సమయంలో పలువురు రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో వారికి నోటీసులు ఇచ్చి, విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Join WhatsApp

Join Now