పిలిస్తే పలికే దేవుడు అనే మాట విన్నాము ఇప్పుడు పిలిస్తే పలికే నాయకుని చూస్తున్నాము

జడ్పిటిసి కి కృతజ్ఞతలు చెప్పిన రత్నాపూర్ గ్రామస్తులు…

రత్నాపూర్ లో బోరు వేయించిన  జడ్పిటిసి
సమృద్ధి నీరు…

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 1  (మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామస్తులు నీటి ఎద్దడితో బాధపడుతున్న సంగతి తెలుసుకున్న అపర భగీరథుడు బగలాముఖి ఆలయ స్థల ధాత ప్రముఖ సంఘ సేవకులు శివ్వంపేట తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా తన సొంత డబ్బులు తో  రత్నాపూర్ లో బోరు వేయించడం జరిగింది  అనంతరం రత్నాపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ పిలిస్తే పలికే దేవుడు అనే మాట విన్నాము ఇప్పుడు పిలిస్తే పలికే నాయకుని చూస్తున్నామని మా దాహార్తిని తీర్చడం కోసం వేసిన బోరు సక్సెస్ కావడం మా అదృష్టంగా భావిస్తున్నామని జెడ్పిటిసి మహేష్ గుప్త సేవలు వెలకట్టలేమని  ఇలాంటి నాయకుడు ఉండడం ఈ మండల అదృష్టమని వారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రత్నాపూర్  మాజీ సర్పంచి యాదగిరి. శివ్వంపేట మాజీ తాజా సర్పంచ్ పత్రాలు శ్రీనివాస్ గౌడ్. ముద్దు గల లక్ష్మీ నరసయ్య. రవీందర్ గౌడ్. బాలేష్. భాస్కర్. తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now