దేవాలయాలను దేశాన్ని రక్షించుకోవాల్సింది మనమే : చిన్న జీయర్ స్వామి 

దేవాలయాలను దేశాన్ని రక్షించుకోవాల్సింది మనమే : చిన్న జీయర్ స్వామి 

ఇక్కడ దర్శించుకుంటే కంచిలో దర్శించుకున్నట్టే 

దేశ రక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలి 

700 సంవత్సరాల దేవాలయ నిర్మాణంలో పాల్గొనడం సంతోషం  

IMG 20250507 WA1292 మార్కుక్ మండలం వరదరాజ పూర్ గ్రామంలో బునీల సమేత వరదరాజస్వామి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా యంత్ర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చిన్న జీయర్ స్వామి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనం ఖర్చు చేసే దాంట్లో ఎంతో కొంత దేశానికి దేవాలయాలకు ఇచ్చి మన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. రోమ్ నగరం కంటే ముందే ఈ దేవాలయం నిర్మించబడ్డదని 700 సంవత్సరాల క్రితం గూడ వంశస్థులు ఈ దేవాలయాన్ని నిర్మించాలని కంచిలో దేవాలయం లో జరిగే ప్రతి కంకర్యాలు ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు. గుడులు కొత్తవి కట్టడం కాదని పాత దేవాలయాలనే పున ప్రతిష్ట చేసి వాటిని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వాలు దేవాలయాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి కానీ అలా కావడం లేదన్నారు. దేవాలయాల నుండి కులవృత్తులు, సబ్బండ వర్గాలు అభివృద్ధి కాబట్టి అన్నారు. 700 సంవత్సరాల పూర్వం నిర్మించబడ్డ ఆలయానికి పున ప్రతిష్ట కార్యక్రమానికి రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ధన్యత పొంది భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉంటాయన్నారు. మరో వెయ్యి సంవత్సరాలు కాలానికి ఈ దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం నాంది పలకను ఉందన్నారు. పురాతన దేవాలయానికి తన వంతుగా లక్ష పది వేల విరాళం ఇచ్చారు. గతంలో ఇక్కడ జరిగిన సాంస్కృతిక వైభవ వానికి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాటిని నాలుగు సంవత్సరాల్లో గా పూర్తి హంగులతో పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా కృషి చేయాలని అన్నారు. దేశంలో జరుగుతున్న దాడులపై ప్రతి ఒక్కరు స్పందించాలని దేశాన్ని ఎవరైనా విచ్చిన్నం చేయాలని చూస్తే కులమత వర్ణ వర్గ తేడా లేకుండా దేశం వైపు చూసేందుకే భయపడాలా చేయాలన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేవాలయాల ద్వారానే క్రమశిక్షణ ధర్మం అలవర్చుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని దేవాలయాల పునః ప్రతిష్ట కార్యక్రమం ద్వారా ఈ వైభవాన్ని రాబోయే తరాలకు అందించే బృహత్తర కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మరి కొంతమంది భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. దేవాలయాలు బాగుంటేనే మన ఇల్లు మన గ్రామం మన దేశం బాగుంటుందని దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాల్పడాలని అన్నారు. గత ఐదు నెలల నుండి గ్రామస్తుల సహకారంతో ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ నిరంతర శ్రమ చేయడం మూలంగా అందుకు ఆయనకు ప్రత్యేకంగా చిన్న జీయర్ స్వామి సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ శ్రీనివాస్చార్యులు వరదరాచార్యులు పురుషోత్తమాచార్యులు గోపాల్ వరుణ్ వర్ధనాచార్యులు వేణు పంతులు నరేష్ ప్రవీణ్ నవీన్ కప్పర ప్రసాదరావు డాక్టర్ ఆకుల నరేష్ బాబు అంతనీ నరసింహులు బ్రహ్మానందరెడ్డి రామకృష్ణారెడ్డి చారి గురు బాల బ్రహ్మచార్యులు స్థపతి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now