మాకూ రాజకీయం తెలుసు.. కారుపై కస్సుమంటున్న కైట్.. కారణం అదేనా..
పొలిటికల్ దోస్తుల మధ్య వైరం షురూ అయ్యిందా ? స్నేహమంటే ఇదేరా అంటూ ముందుకు సాగిన రెండు పార్టీలకు మధ్య బ్రేకప్ అయినట్లేనా? మొన్నటిదాకా కారు మీద ఎగురుకుంటూ వెళ్లిన కైటు ఇప్పుడదే కారుతో ఫైటుకు సిద్ధమైందా?ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి సైలెంట్‌గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్‌పై ఎందుకు సీరియస్ అవుతోంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.ఎన్నికల ముందు వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ ముందుకు సాగాయి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎంఐఎం బీఆర్‌ఎస్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. అలాగని సపోర్ట్‌గానూ మాట్లాడలేదు. బీఆర్ఎస్‌పై దోస్తీ గురించి సైలైన్స్ మెయింటేన్ చేస్తూనే వచ్చింది. తాజాగా జైనూర్ ఘటన సెంట్రిక్‌గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన మనసులోని మాటలన్నీ బయటపెట్టారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూనే మాకు రాజకీయం తెలుసన్న డైలాగులు వదిలారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం ఘటనలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రెండు వర్గాల పరస్పర దాడులతో జైనూర్ రణరంగంగా మారింది. పొలిటికల్‌గానూ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జైనూర్ అల్లర్లకు మీరంటే మీరే కారణంటూ లీడర్లు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇదే ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎన్నడూలేనిది.. బీఆర్ఎస్‌పై ఆయన భగ్గుమన్నారు. అల్లర్ల కేసుల్లో బీజేపీ నేతల కంటే.. ఎక్కువ బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారంటూ డైలాగులు పేల్చారు.అంతేకాదు… వక్ఫ్ బోర్డు బిల్లుపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు అసదుద్దీన్. బీఆర్ఎస్ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే… మాకూ రాజకీయంగా వెయిట్ చేయించడం తెలుసంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు.