ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తాము
కామారెడ్డి జిల్లాలోని రామేశ్వరపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు అందిస్తామని ఆర్డీవో అన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీ కమిటీ సభ్యులు, మహిళ కార్యవర్గ కమిటీ సభ్యులు అందరు కలిసి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన పట్టాల పంపిణీ విషయంలో ఆర్డిఓతో తమ సమస్యలపై చర్చించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు తమ వద్ద ఉన్నాయని త్వరలో కలెక్టర్ ను కలిసి తప్పకుండా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీ కమిటీ అధ్యక్షులు మజీద్, ఉపాధ్యక్షులు మిట్టపల్లి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, కార్యవర్గ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.