అభివృద్ధికి అంకితం .. అందుకోండి మా వందనం
కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి అశోక్
షాద్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు
పార్టీలకతీతంగా తరలివచ్చిన టిడిపి, బిజెపి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు..
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మొట్టమొదటిసారి ఎన్నడూ లేనివిధంగా షాద్ నగర్ పట్టణ అభివృద్ధిలో అందరిని భాగస్వాములు చేస్తూ అందరి బాధ్యతను పెంచుతున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మరియు మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, భీశ్వ కిష్టయ్య, బిజెపి నేత అందే బాబయ్యలకు తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు అని కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యక్తిగత కార్యదర్శి లింగారెడ్డి గూడ అశోక్ తెలిపారు. పట్టణ చౌరస్తా సుందరీకరణ అదే విధంగా విస్తరణ పనులు చేపట్టేందుకు అందరిని భాగస్వాములను చేస్తూ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని అశోక్ తెలిపారు. షాద్ నగర్ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా భేషజాలలు పక్కనపెట్టి ఆత్మీయంగా అందరినీ పలకరించి అభివృద్ధిలో అందరి సూచన సలహాలను పాటిస్తూ, అభివృద్ధిలో సహకరించాలని కోరుతు