మన గతాన్ని గుర్తుంచుకోవాలి

*మీరు కూడా పార్టీ మారిన వారే కదా ఎమ్మెల్యే ..!*

*కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జమ్మికుంట మండల అధ్యక్షుడు రాచపల్లి రమేష్*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీరు కూడా పార్టీ మారిన వారే కదా అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జమ్మికుంట మండల అధ్యక్షుడు రాచపల్లి రమేష్ అన్నారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మీరు బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఉద్యమం చేసిన వాళ్ళు కాదని ఉద్యమానికి కాళ్లు అడ్డం పెట్టిన వారని మీరు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలని వైఎస్ఆర్సిపిలో మీరే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు నష్టం చేయలేదని 2018 లో కాంగ్రెస్ పార్టీ మీకు బ్రహ్మరథం పట్టిందన్నారు.మీకు నీతులు చెప్పే అర్హత లేదని పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకుంటే నట్టేట ముంచినట్టు 2021లో కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టి వెళ్ళిపోయింది మీరూ పార్టీ మారింది మీరు అవన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండని ఇంకొకరి మీద మాట్లాడేటప్పుడు మన గతాన్ని కూడా సరి చూసుకోవాలని సూచించారు.

Join WhatsApp

Join Now