రాహుల్ గాంధీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం
యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు – బుడిగె శ్రీకాంత్
జమ్మికుంట ఆగస్టు 12 ప్రశ్న ఆయుధం
రాహుల్ గాంధీ అరెస్టు ఈసీ,బీజేపీల కుమ్మక్కుకు మరో సాక్ష్యం అని మండిపడ్డారు. ఇండియా కూటానికి చెందిన 300 మందికి పైగా ఎంపీలు చేపట్టిన నిరసనలు పోలీసులు అడ్డుకోవడం చాలా హీనమైన చర్య అని అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్య విలువలు పై జరిగిన దాడిగా భావిస్తున్నామని రాజ్యాంగం ప్రతి పౌరుడు కి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని ఆ హక్కును అడ్డుకునే అధికారం ఎవరికి లేదన్నారు. ఎలక్షన్ కమిషన్ మోడీ అమిత్ షా కనుసన్నాలో నడుస్తుందనీ, ఇటీవల రాహుల్ గాంధీ 2024 లో జరిగిన పార్లమెంటు ఎలక్షన్ పై అనేక అనుమానాలు ఉన్నాయని మీడియా సమావేశం పెట్టి విషయాలను చెప్పడం జరిగిందనీ, కర్ణాటక రాష్ట్రంలోని మహాదేవ్ అనే నియోజకవర్గంలో 40 మందితో 6 నెలలు రాహుల్ గాంధీ యొక్క టీం వర్క్ పని చేసిందని అక్కడ అన్ని దొంగ ఓట్లు ఉన్నాయని, అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారని తెలుసుకున్నారన్నారు. లక్ష దొంగ ఓట్లను గుర్తించారని, ఒకే ఇంటి నెంబరుతో దాదాపు పదివేల దొంగ ఓట్లను సృష్టించారని తెలిపారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్న భారత ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై అనేక అనుమానం వ్యక్తం అవుతున్నాయన్నారు
ఒక్క మహదేవ్ అనే నియోజకవర్గంలో నకిలీ ఓట్లు సృష్టిస్తే, భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్ని దొంగ ఓట్లను బిజెపి పార్టీ సృష్టించిందో విషయం స్పష్టంగా అర్థమవుతుందని రాహుల్ గాంధీ కుటుంబం భారతదేశానికి సేవ చేయడానికి ఉందని వారి కుటుంబంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, అయిన కూడా వారి కుటుంబం ఏనాడు సేవ చేయడానికి వెనుకాడలేదని తెలిపారు.