రైలులో యువతిపై జరిగిన దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

*రైలులో యువతిపై జరిగిన దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.*

*దుండగున్ని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి*

*ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎన్ హెచ్ ఆర్ సి గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వీరమల్ల రామ్మూర్తి*

సెక్రటేరియట్ (హైదారాబాద్): మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ మహిళల భోగిలో ఎక్కిన యువతిపై లైంగిక దాడికి యత్నించిన దుండగుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీరమల్ల రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైలులో ఒంటరిగా ఉన్న యువతిని చూసి గుర్తు తెలియని యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ బలవంతం చేసే ప్రయత్నంలో యువతి భయపడి కదులుతున్న రైలు నుంచి దూకి తీవ్ర గాయాల పాలయిందని, జి ఆర్ పి సిబ్బంది అక్కడ చేరుకొని బాధితురాలిని గాంధీ ఆసుపత్రిలో చేర్చగా అక్కడి నుండి యశోదాకు తరలించారని ఆయన తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిందితుని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని కలచివేసిందని, రాజధానిలోనే ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు, రైల్వే యంత్రాంగాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి దారుణాలను ఆపవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now