*పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం*
*జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి*
*జమ్మికుంట ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కు పాదం మోపాలని అన్నారు. దేశ పౌరులకు భద్రతతో కూడిన భరోసా అందించాలన్నారు. దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను పెంచాలని మృతులకు సంతాపం తెలిపి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.