ఏపీలో హైడ్రా తరహ వ్యవస్థను తీసుకొస్తాం..!!

*ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి**అమరావతి:సెప్టెంబర్ 19*తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇవాళ ఏపీ సచివాలయం లో మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ… త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహా లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పరిగ ణలోకి తీసుకుంటామని తెలిపారు. జగనన్న కాలనీ ల్లో అక్రమ నిర్మాణాలపై విచారణ ముగిసిందని చెప్పారు. నివేదిక ఆధా రంగా చర్యలు ఉంటాయని పార్థసారధి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పని చేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేత లకు చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మంత్రి..

IMG 20240919 WA0106

Join WhatsApp

Join Now