ఎమ్మెల్యేలతో కలిసి డిజిపి ఆఫీసుని ముట్టడిస్తాం

●గోమారం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి

●తెలంగాణను బీహార్
మారుస్తున్నరు

●రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇందుకు కారణం

● మాజీ మంత్రి హరీశ్ రావు

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 23 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

ప్రజాపాలన కాదు గుండాల రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.సోమవారం నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
మొన్న సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయం మీద, హైదరాబాదలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద, ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గుండాలు చేస్తున్న దాడులకు రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాం మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయని ఆరోపించారు వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపై దాడి జరిగిందా అని ప్రశ్నించారు. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తూ మరో బీహార్ గా మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. గోమారంలో గొడవ జరుగుతున్న ఘటనను వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పైదాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. అలాగే ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు అలాగే డి జి పి వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అరెస్టు చేయని పక్షనా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డిజిపి ఆఫీసుని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మాజీ గ్రంధాలయసంస్థ చర్మన్ చంద్ర గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, శివ్వంపేట మండల మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా. శివ్వంపేట మండల మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, శివ్వంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్, మరియువివిధ మండలాల మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు, టిఆర్ఎస్ పార్టీ మండల గ్రామ అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు మరియు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now