Site icon PRASHNA AYUDHAM

మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం..!!

IMG 20241028 WA0080

*విద్యార్థుల నినాదాల తో హోరెత్తిన కలెక్టరేట్*

 

  1. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్ షీప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

విడుదల చేయకపోతే మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం నియోజవర్గాలలో అడుగడుగున అడ్డుకుంటాం

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

*పి డి ఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాఅధ్యక్ష కార్యదర్శులు అంగిడి కుమార్ ముల్కల మారుతి*

కరీంనగర్ అక్టోబర్ 28 ప్రశ్న ఆయుధం:-

సోమవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ముందు పిడిఎస్యు స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంగిడి కుమార్ ముల్కల మారుతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు విద్యార్థుల నినాదాలతో కలెక్టరేట్ హోరెత్తినది కలెక్టర్ పమేలా సత్పతి కి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ల సమస్య పై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న 6350 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి సంవత్సరకాలం గడిచిపోయిన కూడా ఇంకా విద్యారంగం పట్ల సరైన నిర్ణయాలు చేయడం లేదని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన 6350 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని కెసిఆర్ నిర్లక్ష్యం కారణంగా విద్యారంగం విధ్వంసానికి గురైందని కెసిఆర్ అడుగుజాడల్లో నేటి గవర్నమెంట్ నడుస్తుందని ఎద్దేవా చేశారు వెంటనే ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థులకు రావలసిన ఫీజులు ఇంపార్టెన్స్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తును పూలబాట వేయాలని కోరారు ఒకవేళ రియంబర్నెస్ స్కాలర్షిప్ విడుదల చేయని పక్షంలో నియోజకవర్గాల వారీగా మంత్రుల ఇండ్లను ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని నియోజకవర్గాల్లో తిరుగుకుంటా అడుగడుగున అడ్డుకుంటామని పేర్కొన్నారు ఈ ధర్నాలో యూనియన్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version