ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 30(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో శుక్రవారం నాడు ఉదయ బి ఆర్ స్ నాయకులు మా ఇండ్ల వద్దకు , పొలాల వద్దకు వచ్చి మమ్మలని బలవంతంగా తీసుకెళ్లి వద్దు వద్దు అంటున్న బి ఆర్ స్ కండువా కప్పారు , కానీ మేము అందరం కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని , అందుకే నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజారెడ్డి మరియు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ సమక్షములో కాంగ్రెస్ పార్టీ లో గురువారం చేరాము అని తెలియచేసారు. ఇకముందు కూడా కాంగ్రెస్ పార్టీ నీడలోనే కొనసాగుతామని నవీన్ గుప్త నాయకత్వములోనే పని చేసి గ్రామం అభివృద్ధికీ మరియు కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి కై పని చేస్తామని తెలియచేసారు . ఈ కార్యక్రములో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ గుప్త , గంగపుత్ర సంఘం నాయకులు కొడాలి నాగేష్ , కాముని కిషన్ , గంగారాం , ఎంపటి కృష్ణ , కరవాల సత్తయ్య , కిషన్ , జీడిపల్లి నాగరాజు, పూస నాగరాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారాల గణేష్ , సత్తయ్య , ఈసరపు రాజు గౌడ్, బసంపల్లి ప్రభు లింగం గౌడ్ , వజ్జే శ్రీను , లస్కారి ఆంజనేయులు , సరిగారి నారాయణ , ఈసరపు శ్రీనివాస్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు