కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తాం..
-ఆర్డీవో రవీందర్ రెడ్డి
-డబుల్ బెడ్ రూమ్ అందిస్తానని ఎమ్మెల్యే జిఎంఆర్ హామీ
-పారిశుద్ధ్య కార్మికుడి మృతి పట్ల కార్మిక సంఘాల ఆగ్రహం
-పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులతో ధర్నా
డ్రైనేజీలో చెత్త చదారాన్ని తొలగిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడికి మద్దతుగా వరప్రసాద్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బాలాజీ నగర్ కౌన్సిలర్ సుజాత మహేందర్ రెడ్డి, మున్సిపల్ బిజెపి అధ్యక్షులు ఆనంద్ రెడ్డి రాష్ట్ర కార్మిక నాయకులు, ఆయా కార్మిక సంఘాల యూనియన్లతో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.పారిశుద్ధ్య కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు అజాగ్రత్త వహించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసే కార్మికులకు ఎలాంటి భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కార్మికుడు మృతి చెందాడని వాపోయారు. పనిచేసే ప్రతి కార్మికుడి వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని తగువిధంగా జాగ్రత్తలను పాటించాలని అధికారులను కోరారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న ఆర్డీవో రవీందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మంగ తయారీతో కలిసి నిరసన కారుల వద్దకు వచ్చి మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. అలాగే మున్సిపల్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అందిస్తామన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వరప్రసాద్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి అండగా నిలవాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ వచ్చేలా కలెక్టర్’తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈలోగా మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయాలని సూచించారు. దీంతో అధికారులు ప్రజాప్రతినిధుల చొరవతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ గంగాధర్, కార్మిక సంఘాల నాయకులు నాగేశ్వరరావు, మున్సిపల్ మేనేజర్లు మల్లికార్జున్ నిర్మలారెడ్డి, పారిశుధ్య కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.
కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తాం..
by kana bai
Published On: November 12, 2024 6:47 pm