Site icon PRASHNA AYUDHAM

పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తే జిపిలకు తాళం వేస్తాం..!

IMG 20241227 WA0068

పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తే జిపిలకు తాళం వేస్తాం

* పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీసర్పంచులు…

* అప్పులు చేసి గ్రామాల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన…

* సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికల నిర్వహించాలి…

* పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్…

* ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలు మరువలేనివి…

చిగురుమామిడి,డిసెంబర్27 “:గ్రామాల అభివృద్ధి కోసం చేసిన పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా మరిన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే తాము నిర్మించిన గ్రామ పంచాయతీలకు తాళాలు వేస్తామని తాజామాజీసర్పంచులు శుక్రవారం స్పష్టం చేశారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మాజీసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జక్కుల రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీసర్పంచ్ ల ఫోరం ఆదేశాల మేరకు తమ సమస్యలను రాసి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.ముందు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి,వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వక,అప్పుల ఇఛ్చిన వారికి వడ్డీలు కట్టలేక తీవ్ర వేధింపులకు గురవుతున్నామని,సర్పంచుల కుటుంబాలు చిన్న బిన్నమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం.సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని,పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని మాజీసర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న నినాదంతో తమ గ్రామాలను అప్పులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తే అధికారం రాకముందు మరో మాట గద్దెనెక్కాక మరొక మాట మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను అవమాన పరుస్తుందని వారు ధ్వజమెత్తారు. తమకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా రాబోయే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని చూస్తే అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మాజీమండల అధ్యక్షుడు జక్కుల రవీందర్,సన్నీల్ల వెంకటేష్,గోలి బాపు రెడ్డి,నాగేల్లి వకుళా లక్ష్మారెడ్డి,బెజ్జంకి లక్ష్మణ్, ముప్పిడి నరసింహారెడ్డి,చెప్యాల మమత శ్రీనివాస్ గౌడ్,తదితరులు ఉన్నారు.

Exit mobile version