తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బిజెపి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్
గజ్వేల్ సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :
వీర తెలంగాణ సాయిధరైతంగా పోరాటం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు అన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ వారోత్సవాలను గజ్వేల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ప్రజ్ఞాపూర్ లో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం కోలాభిరామ్ గార్డెన్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఎర్రజెండాల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం1946 నుండి 1951 వరకు జరిగిందని అన్నారు 3000 గ్రామాలు ప్రజారాజ్యాలుగా ఏర్పడ్డాయని 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచడం జరిగిందని 4వేల మంది అమరులయ్యారనిఅన్నారు నైజాం కాలంలో 1500 మంది అమరులు కాగా భారత దేశం లో విలీనం తర్వాత 2500 మందిని రజాకర్ సైన్యాలు, మిల్ట్రీ దాడులు చేసి చంపేయడం జరిగిందని అన్నారు.నీ కాల్మొక్త బాంచన్ అన్న పేదలు గుత్పలు వడిసెలతో తుపాకులు తో పోరాటం నిర్వహించారని అన్నారు నైజం సంస్థానంలో జమీందారులు జాగిర్దారులు దేశ్ముకులు దేశ్పాండేలు విచ్చలవిడిగా ప్రజలపై పన్నులు విధిస్తూ అక్రమంగా భూములు గుంజుకోవడం జరిగిందని విస్నూర్ రామచంద్ర రెడ్డి కి 1,50,000 ఎకరాలు, జెన్న ప్రతాప్ రెడ్డికి లక్ష ఎకరాలు సూర్యపేట జమీందారు 25వేల ఎకరాలు, కల్లూరు దేశ్ముఖ లక్ష ఎకరాలు, జమీందారు, జాగిర్దారులకు వేలాదికరాల భూములు భూములు ఉన్నాయని అన్నారుదొరల కుటుంబాలలో పెండ్లిలు జరిగిన పెళ్లికూతురుతో పాటు గ్రామ యువతుల్ని పంపేవారని అన్నారు గ్రామ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు దళితులు చాకలి మంగలి వారు గ్రామాలకు కుటుంబాలకు కాపలాగా ఉండే వారిని కుమ్మరులు వంట చేసే వారిని గొల్లలు ఉచితంగా గొర్రెలను ఇచ్చేవారని గౌడ కులస్తులు తాళ్లను ఇచ్చే వాళ్ళని అన్నారు నిత్యవసర సరుకులను కోళ్లను బలవంతంగా గుంజుకుని వెళ్లేవారని వారితో పాటు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించే వారిని అన్నారు కౌలు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న చాకలి ఐలమ్మ ను పంటను విసునూరు జమిందార్ అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయగా సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అడ్డుకోవడం జరిగిందని దీంతో రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ మరింత ప్రజలను హింసించాలని అన్నారు మహిళలు చిన్నపిల్లలకు పాలుగా పోనివ్వకుండా వేధింపులకు గురి చేశారని అన్నారు బైరాన్ పల్లి లో 116 మందిని కాల్చి సజీవ దహనం జరిగిందని పాలకుర్తిలో వందమందికి పైగా చంపడం జరిగిందని అనేక మందిని గడ్డి వాములో వేసి దహనం చేయడం జరిగిందని అన్నారు దీనికి వ్యతిరేకంగా గ్రామంలో సంఘాలుగా ఏర్పడి నైజాం జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు దీని ఫలితంగా దొరలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాలకు పోయారని తెలిపారు దీంతో నైజాం సర్కార్ కాంగ్రెస్ తో కలిసిపోయి ఐదు రోజుల్లో భారతదేశంలో విలీనం చేశాడని అన్నారు దేశంలో కమ్యూనిస్టులు ఎదగకుండా కుట్రలు చేసి నైజాంp శిక్షలు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వేతనం ఇచ్చిందని, రాజ్ ప్రముఖ ప్రకటించి 51 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగించిందని అన్నారు స్వతంత్ర పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాత్రలేని బిజెపి ఆర్ఎస్ఎస్ లో తెలంగాణ పోరాటాన్ని వక్రీకరణ చేస్తున్నాయని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటం దోపిడి వ్యతిరేక పోరాటం అని కులం మతం ప్రాంతాలకు అతీతంగా మాగ్దూంమొయినుద్దీన్ సోయబుల్లాఖాన్ ,బందగి ఇలాంటి ముస్లిం పౌరులు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం పుచ్చలపల్లి సుందరయ్య రామచంద్రారెడ్డి నల్ల నర్సింలుబద్దం ఎల్లారెడ్డి ఆరుట్ల కమలాదేవి అనేక మంది పోరాటం నిర్వహించారని అన్నారు 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య మరణంతో తెలంగాణ వ్యాప్తంగా పోరాటం ప్రారంభమైందని, చాకలి ఐలమ్మ అనేకమంది ప్రాణాల త్యాగం చేసి పోరాటం నిర్వహించారని అన్నారు ప్రస్తుతం నాటి పోరాట ఫలితంగా లభించిన భూములు మరల కంపెనీలకు భూస్వాములకు కట్టబెట్టడం జరుగుతుందని పరిశ్రమలో కార్మికులకు కనీస వేతనాలు లేవని ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో కార్మికులను చేస్తుందని వేతనాల పెంపుకై సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కామణి గోపాలస్వామి, శశిధర్, రవి, బండ్ల స్వామి, రంగారెడ్డి, ప్రశాంత్, అరుణ్, వెంకట చారి, ప్రవీణ్, చంద్రశేఖర్ రెడ్డి, కనుకయ్య, అహ్మద్, బాబురావు, ఎల్లం, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.