రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం విధులు నిర్వర్తిస్తాం

*రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం విధులు నిర్వర్తిస్తాం*

* కమిషనర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారికి, భరతమాత చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన కమిషనర్*

* పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కలిసి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం నిధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ*

* పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ

భారత రాజ్యాంగం ఆమోదించి నేటికీ 75 సంవత్సరాలు అయినందున భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని కమిషనర్ అన్నారు . దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వము, సౌభాగృత్వాలను అందిస్తూ రూపొందించబడిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడి నేటికీ 75 సంవత్సరాలు పూర్తయినందున జిల్లా ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఏఓ యాదమ్మ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ విష్ణు ప్రసాద్, మరియు పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment