Site icon PRASHNA AYUDHAM

క్రీడా మైదానాలను ఏర్పాటుచేసి నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తాం

IMG 20250203 WA0045

*క్రీడా మైదానాలను ఏర్పాటుచేసి నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తాం*

*కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 03:కుత్బుల్లాపూర్*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 – జీడిమెట్ల డివిజన్లోని సెయింట్ మోసెస్

హైస్కూల్ వేదికగా కుత్బుల్లాపూర్ మండలం స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లిటరరీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, సీనియర్ వెటరన్ అథ్లెట్ మర్రి లక్ష్మారెడ్డి హాజరై స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినట్లయితే మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభ సూచికగా బెలూన్లను గాలిలోకి వదలడంతో పాటు జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల విద్యాధికారి జెమిని కుమారి, నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, ఎల్లా గౌడ్, అసిస్టెంట్ ఎంఈవో రమేష్, స్టేట్ ప్రెసిడెంట్ ఎస్. ఎన్.రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు సిహెచ్.మల్లేశం, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ముంతాజ్ అలీ, గిరి, రాజు, చైర్మన్ శివయ్య, ప్రెసిడెంట్ సీహెచ్.మహేష్, ప్రధాన కార్యదర్శి రవి కుమార్, కోశాధికారి గోవర్ధన్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version