బంద్‌తో బీసీల తడాఖా చూపిస్తాం – బీసీ జేఏసీ నిర్ణయం
రేపటి బంద్ విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపు
విద్యా, వాణిజ్య, ఆటో, కిరాణా రంగాలన్నీ బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి
గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు నిరసనలు, ఐక్యత ప్రదర్శన
“మెమెంటే మాకంత” నినాదంతో 42% రిజర్వేషన్ దిశగా కదలిక
అన్ని పార్టీలు, సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపి ప్రణాళికలు సిద్ధం
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో నాయకులు రేపు జరగబోయే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సబ్బండ వర్గాలన్నీ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని, బీసీల ఐక్యతను చాటాలని కోరారు.
విద్యా, కిరాణా, వాణిజ్య, వర్తక, ఆటో సంఘాల నేతలను కలిసి బంద్‌కు మద్దతు ఇవ్వమని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్, డీఈఓ, ఎన్‌జీఓ, టీఎన్‌జీఓ సంఘాల అధ్యక్షులకు వినతిపత్రాలు అందజేసినట్టు వెల్లడించారు.
“మెమెంటే మాకంత” అనే నినాదంతో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ బంద్ ద్వారా బీసీల సత్తా దేశవ్యాప్తంగా వినిపించేలా నిరూపిస్తామని స్పష్టం చేశారు.
బంద్ విజయవంతం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీజేఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్, ప్రజాపంత్, ఎల్‌హెచ్‌పీఎస్ నేతలు, బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనార్టీ సంఘాలు కలిసి ప్రణాళికలు రచించాయి.
ఈ సమావేశంలో నీల నాగరాజు ముదిరాజ్, కుంబాల లక్ష్మణ్ యాదవ్, శివరాములు, పండ్ల రాజు, కుంబాల రవి, నాగరాజ్ గౌడ్, మార్కంటి భూమన్న, కొత్తపల్లి మల్లన్న, గైని శ్రీనివాస్ గౌడ్, కన్నయ్య, గణేష్ నాయక్, చింతల శంకర్, బాను, రాజయ్య, సాయి కృష్ణ, రాజీవ్, రాజేందర్, గోవర్ధన్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.