సమస్యలు పరిష్కారిస్తాం

టీఎన్జీవోస్‌ కాలనీ లో సమస్యలకు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటాం…శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం ఆగస్టు 06 :శేరి లింగంపల్లి ప్రతినిధి

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్‌ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు తో సమావేశమై ఎక్కడ ఉన్నా సమస్యలు అడిగి తెలుసుకునీ నెలకొన్న సమస్యలపై సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా తమ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ నిర్మాణము పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వసతిని మెరుగుపర్చాలని, విధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడలని,పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ పనులను మరియు రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని,మంజీర మంచీ నీటి వసతిని మెరుగుపరుస్తామని,దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి టీఎన్జీవోస్‌ కాలనీ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని తెలియచేసారు.పెరుగుతున్న జనాభా దృశ్య భూగర్భ డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్,జలమండలి అధికారులు జీఎం బ్రిజేష్,డీజీఎం శరత్ కుమార్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి,డిఈ విసాలాక్షి, ఏఈ జగదీష్, ,స్ట్రీట్ లైట్స్ ఈఈ మల్లికార్జున్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగ మళ్లిఈశ్వరి ఎలక్ట్రికల్ ఏఈ నిఖిత జి.హెచ్.ఎం.సి అధికారులు,డివిజన్ నాయకులు, టీఎన్జీవోస్‌ కాలనీ వాసులు,సీనియర్ నాయకులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now